కొవిడ్ పాజిటివ్ కేసుల విషయంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, ఆదిలాబాద్ జిల్లా శాఖ విడుదల చేస్తున్న నివేదికలు పొంతన లేకుండా ఉంటున్నాయి. ఈ నివేదికలతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. రాష్ట్ర శాఖ విడుదల చేస్తున్న నివేదికలకు జిల్లా వైద్యారోగ్య శాఖ విడుదల చేస్తున్న నివేదికల్లో భారీ తేడాలు ఉండటం దీనికి కారణంగా మారింది. వీటిలో ఏ నివేదికలను నమ్మాలో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.
కరోనాపై కాకి లెక్కలు... గందరగోళంలో ప్రజలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీనికి తోడు పాజిటివ్ కేసుల విషయంలో వస్తున్న తేడాలు ప్రజలను మరింత ఆందోళన చెందేలా చేస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ విడుదల చేస్తున్న నివేదికల్లో తేడాలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి.
కరోనాపై కాకి లెక్కలు... గందరగోళంలో ప్రజలు
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేస్తున్న నివేదికలను టీవీల్లో చూసిన ప్రజలు, అనంతరం జిల్లా నివేదికల వివరాలను పరిశీలించి ఇదేలా సాధ్యమని చర్చించుకుంటున్నారు. ఈ విషయమై జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి రాఠోడ్ నరేందర్ని ప్రశ్నిస్తే తాము విడుదల చేస్తున్న నివేదికలు కచ్చితమైనవని పేర్కొంటున్నారు. రాష్ట్ర స్థాయిలో ఏ ప్రాతిపదికన నివేదికలిస్తున్నారో తమకు సమాచారం లేదని స్పష్టం చేశారు.