తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ ఘటనపై అధికారులు ఎందుకు స్పందించ లేదు: హెచ్​ఆర్సీ - ఆదిలాబాద్​ రిమ్స్​ ఆస్పత్రి తాజా వార్తలు

ఆదిలాబాద్​ రిమ్స్​ ఆస్పత్రిలో కరోనా బాధితులకు పౌష్టికాహారం అందడం లేదనే కథనంపై హెచ్​ఆర్సీ స్పందించింది. సుమోటోగా కేసు స్వీకరించింది. ఈ విషయంపై అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించింది.

ఆ సంఘటనపై అధికారులు ఎందుకు స్పందించలేదు: హెచ్​ఆర్సీ
ఆ సంఘటనపై అధికారులు ఎందుకు స్పందించలేదు: హెచ్​ఆర్సీ

By

Published : Jul 14, 2020, 8:05 PM IST

'కరోనా బాధితులకు అందని పౌష్టికాహారం.. కనిపించని కనికరం...' శీర్షికతో ఈనాడులో వచ్చిన కథనంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు స్వీకరించింది. కొవిడ్​ వ్యాధిగ్రస్థులకు అందించే పౌష్టికాహారం విషయంలో.. ప్రభుత్వం స్పష్టమైన మార్గ దర్శకాలను జారీ చేసినప్పటికీ.. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అవి అమలు కాకపోవడంపై హెచ్​ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

గుత్తేదారు సరఫరా చేసిన ఇడ్లీలో పురుగు రావడం వల్ల బాధితులెవరూ అల్పాహారం తీసుకోలేదని.. ఇంత జరిగినా సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదని హెచ్​ఆర్సీ ప్రశ్నించింది. ఈ సంఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని.. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, రిమ్స్ ఆసుపత్రి సూపరెండెంట్​కు ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చూడండి:సచివాలయం కూల్చివేతతో ఏర్పడే వ్యర్థాలను ఏం చేస్తారంటే..

ABOUT THE AUTHOR

...view details