తెలంగాణ

telangana

ETV Bharat / state

కడుపులో ఉంది కవలలు... కాదు కాదు ట్యూమర్ - hospital fraud

వైద్యం కోసం వెళితే... రెండు నెలల గర్భం అని నిర్ధరించారు. కవలలు ఉన్నారంటూ ఊరించారు. ఆ తర్వాత నెలనెలా వైద్య పరీక్షలంటూ... డబ్బులు దండుకున్నారు. పరీక్షలు చేయించుకున్న రెండు ఆసుపత్రుల్లో ఇద్దరు వైద్యులు ఇలానే చేశారు. రిపోర్టులో ఓవరాన్​ట్యూమర్​ అని స్పష్టంగా ఉన్నా... గర్భం అని మోసం చేశారు. తీరా పది నెలల తర్వాత గర్భం కాదని ఊసురుమనిపించారు.

కడుపులో ఉంది కవలలు... కాదు కాదు ట్యూమర్

By

Published : Sep 16, 2019, 11:24 PM IST

ఆదిలాబాద్​ జిల్లాలో ఓ ప్రైవేటు వైద్యుడి నిర్వాకం బయటపడింది. సిరికొండ మండలం సోంపల్లికి చెందిన బూసేవాడె సోని వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లింది. గర్భం దాల్చినట్లు నిర్ధరించి, కవలలు ఉన్నట్లు తెలిపారు. దాదాపు 7 నెలలుగా వైద్యపరీక్షల కోసం తిరిగిన తర్వాత... మరో వైద్యుడిని సంప్రదించారు. అక్కడ కూడా అన్ని పరీక్షలు చేసి మాయ కిందకు వచ్చింది తప్పనిసరిగా శస్త్రచికిత్స కోసం రిమ్స్​కు వెళ్లాలని సూచించాడు. రిమ్స్​లో రక్త, మూత్ర నమూనాలు తీసుకొని... రిపోర్టులు ఆలస్యంగా వస్తాయని సిబ్బంది చెప్పారు.

బాధితురాలు నిర్మల్ జిల్లా కేంద్రంలోని మరో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా... ఓ వింత విషయం బయటపడింది. ఆ మహిళ అసలు గర్భం దాల్చలేదని, ఓ వింత వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధరించారు. ఈ విషయం విన్న కుటుంబసభ్యులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ప్రెగ్నెన్సీ ఉన్నట్లు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి 10 నెలలుగా వైద్యులు మోసం చేశారని ఆరోపిస్తున్నారు. ప్రెగ్నెన్సీ స్కానింగ్ రిపోర్టులో మాత్రం ఓవరాన్​ట్యూమర్​ ఉండటం గమనార్హం.

కడుపులో ఉంది కవలలు... కాదు కాదు ట్యూమర్

ఇదీ చూడండి: త్వరలో ఆమరణ నిరాహారదీక్ష: ఉత్తమ్

ABOUT THE AUTHOR

...view details