తెలంగాణ

telangana

ETV Bharat / state

గిరిజనుల సాధికారతకు కృషి చేయాలి: దత్తాత్రేయ - తెలంగాణ వార్తలు

ఆదిలాబాద్ జిల్లా నాగోబా ఆలయాన్ని హిమాచల్​ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి... మొక్కులు చెల్లించుకున్నారు. గిరిజనుల సాధికారత కోసం కృషి చేయాలని ఆయన సూచించారు.

himachal-pradesh-governor-bandaru-dattatreya-visits-nagoba-jatara-in-adilabad-district
గిరిజనుల సాధికారతకు కృషి చేయాలి: దత్తాత్రేయ

By

Published : Feb 15, 2021, 4:56 PM IST

గిరిజనుల సాధికారత కోసం కృషి చేయాలని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌ నాగోబా ఆలయాన్ని సోమవారం దర్శించుకున్న దత్తాత్రేయ.. ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య, వైద్యం మెరుగుపర్చాలన్నారు. ఏజెన్సీలో 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ప్రజలంతా క్షేమంగా ఉండాలని నాగోబాను మొక్కుకున్నానని దత్తాత్రేయ తెలిపారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి... మొక్కులు చెల్లించుకున్నారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దర్శనానికి ముందు ఆదిలాబాద్‌కు హెలికాప్టర్‌లో చేరుకున్న ఆయనకు స్థానిక అధికారులు, భాజపా నేతలు స్వాగతం పలికారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details