వర్షానికి కూలిన భారీ వృక్షం.. రాకపోకలకు అంతరాయం - adilabad rains
ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్లో భారీ వృక్షం నేలకూలింది. చెట్టును తొలగించేందుకు పురపాలక సిబ్బంది ముందుకురావపోవడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వర్షానికి నేలకూలిన భారీ వృక్షం.. రాకపోకలకు అంతరాయం
ఆదిలాబాద్ పట్టణం విద్యానగర్కాలనీలో వర్షానికి భారీ వృక్షం నేలకూలింది. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఫలితంగా విద్యానగర్తోపాటు రిక్షా కాలనీ, సంజయ్ నగర్, టైలర్స్ కాలనీ, భుక్తాపూర్ కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానికుల ఫిర్యాదుతో విద్యుత్ శాఖ సిబ్బంది మరమ్మతులు చేసి సరఫరా పునరుద్ధరించారు. రోడ్డుపై పడిన చెట్టును తొలగించకపోవడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఇవీ చూడండి: కరవుసీమలో ఖర్జూరం పండిస్తున్న సాఫ్ట్వేర్ యువకుడు