తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Flood 2023 : వరద వచ్చి.. విధ్వంసం సృష్టించింది.. ఆదుకునేదెవరు? - Problems in Telangana due to Heavy Rains

Heavy loss in Telangana due to Flood : వరదలు మిగిల్చిన విషాదం కొనసాగుతోంది. పంటలు నష్టపోయి.. పొలాల్లో ఇసుక మేటలు వేసి.. అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. వాగులు పొంగడంతో.. వంతెనలు దెబ్బతిన్నాయి. రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. రహదారులు అస్తవ్యస్తంగా మారి.. ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 30, 2023, 9:20 PM IST

వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలు

Problems in Telangana due to Heavy Rains : కుమురం భీం జిల్లాలో పెన్‌గంగా, ప్రాణహిత నదులు ఉప్పొంగడంతో.. పరివాహక ప్రాంతాల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కౌటాల, సిర్పూర్ టి, మండలాల్లో.. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. ప్రాణహిత, పెన్‌గంగా వరదలతో ఆరు మండలాలపై ప్రభావం పడింది. రైతులు జూన్​, జులై, ఆగస్టు నెలల్లో పనులు ప్రారంభించి.. పత్తి, వరి, కంది, మిరప పంటలను పండిస్తారు. నదుల వల్ల వస్తున్న వరద కారణంగా పంట పొలాలు నీట మునిగాయి. నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

Roadways Stopped Due to Flood in Telangana : కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌తో ఎటా వేలాది ఎకరాలు నీటమునుగుతున్నాయి. ప్రతి వర్షకాలంలో ఇలాగే జరుగుతున్నా తమకు ప్రభుత్వం పరిహారం ఇవ్వడం లేదని బాధితులు చెబుతున్నారు. పంటలు మునిగినప్పుడే సర్వే పేరుతో అధికారులు హడావుడి చేస్తున్నారని.. ఆ తర్వాత పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పంటలు దెబ్బతినడం ఒకవైపు.. వంతెనలు, రహదారులు అస్తవ్యవస్తంగా మారడం మరోవైపు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు శాపంగా మారింది. కుమురం భీమ్ జిల్లా కాగజ్‌నగర్‌-హేగామ్‌ మండలాలను కలిపే వంతెన.. గత వానకాలంలో కూలిపోయింది. ఇప్పటికీ పునఃనిర్మాణ పనులు చేపట్టలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంతెన మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.13.5 కోట్ల కేటాయించినా పనుల్లో చలనం లేదని తెలిపారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. థర్మకొల్ పడవల్లో పెద్దవాగును దాటుతున్నారు.

Satyavathy Rathore on flood victims : "ముంపు బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం"
Kamareddy Flood in 2023: కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం లింబూర్‌వాడి వాసులు.. వేరు ఊళ్లకు వెళ్లాలంటే నరకం అనుభవిస్తున్నారు. వర్షకాలంలో ఎక్కడికి వెళ్లాలన్నా.. వాగు దాటాల్సిందే. వాగుపై వంతెన లేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు చేస్తున్నారు. గ్రామానికి వెళ్లే మూడు కిలోమీటర్ల మట్టి రోడ్డు కూడా అధ్యానంగా ఉంది. చిన్నపాటి వర్షం కురిసినా.. బురదమయం అవుతుంది. నడిచేందుకు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వంతెన నిర్మిస్తామని ఎన్నికల సమయంలో నేతలు హామీలు ఇస్తున్నా.. ఆ తర్వాత పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గతంలో రోడ్డు నిర్మించాలని పలుమార్లు నిరసనలు తెలిపారని స్థానికులు తెలిపారు. వర్షాల వల్ల మార్గం మొత్తం బురదగా మారిందని.. నిత్యవసర సరుకులు తీసుకువచ్చేందుకు కూడా సమస్యగా మారిందని గ్రామస్థులు వాపోతున్నారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఇబ్బందులపై వెంటనే దృష్టిసారించి.. పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు. ఆ గ్రామానికి బీటీ రోడ్డుతో పాటు వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని స్థానికులు వేడుకుంటున్నారు.

"వంతెన వల్ల మాకు చాలా సమస్యలు వస్తున్నాయి. చిన్న జ్వరం వచ్చినా.. ఎవరైన డెలివరీ అయిన వాగు దాటాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మా గ్రామానికి ఆంబులెన్స్​ రాడానికే చాలా కష్టం. మాకు కూరగాయలు, వంట సరుకులు.. ఇతర వస్తువులు ఏమి దొరకడం లేదు. మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోలేదు. వంతెన నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను." - బాధితుడు

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details