తెలంగాణ

telangana

ETV Bharat / state

Adilabad Rains : రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం ఉమ్మడి ఆదిలాబాద్‌లోనే.. మహరాష్ట్ర-తెలంగాణ మధ్య రాకపోకలు బంద్

Rains In Adilabad : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు ఒకెత్తు అయితే.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో కురుస్తున్న వర్షాలు మరో ఎత్తు. ఎందుకంటే గత నాలుగు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు జన జీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. జిల్లాకు ఉత్తరాన ఉన్న పెన్‌గంగా, దక్షిణాన ప్రవహించే గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధాన జలయాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సింగరేణి ఉపరితల బొగ్గుగనుల్లో బొగ్గు ఉత్పత్తి స్తంభించింది.

Adilabad Rains
Adilabad Rains

By

Published : Jul 22, 2023, 10:26 PM IST

Heavy Rains In Adilabad : ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా ఐదు రోజులు చినుకు ఆగకుండా కురిసిన వానలతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అతలాకుతలమైంది. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని పెన్‌ గంగా సహా వాగులు, ఒర్రెలు ఉద్ధృతంగా ప్రవహించడంతో జన జీవనం పూర్తిగా స్తంభించి పోయింది. ఉత్తర-దక్షిణ భారతాన్ని అనుసంధానం చేసే జైనథ్‌ మండలం డొల్లార వద్ద 50 అడుగుల ఎత్తుతో ఉన్న వంతెనను తాకుడూ పెన్‌గంగా పరవళ్లుతో అధికారయంత్రాంగం రాకపోకలు పూర్తిగా నిలిపివేసింది. అక్కడి ప్రజాప్రతినిధులు ముందస్తు చర్యల్లో భాగంగా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపించాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించాయంటే సమస్య తీవ్రతను అర్థమవుతోంది.

రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం కుమురం భీం జిల్లా సిర్పూర్‌(యు)లో 23.15 సెం.మీ.గా నమోదైంది. ఈజిల్లాలోని వాంకిడి మండలం బోర్డా వాగులో కాలకృత్యాలకు కోసం వెళ్లిన అదే గ్రామానికి చెందన అంజన్న అనే వ్యక్తి గల్లంతయ్యాడు. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం వడూర్‌ ఆనుకొని ఉన్న పెన్‌గంగ ఒడ్డున ఉన్న పడవను తీసుకురావడానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. చివరికి వారిని టైర్లు, ట్యూబుల సహాయంతో బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మండలంలో దాదాపుగా 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెన్‌గంగ నదీపరివాహక ప్రాంతాల్లో దాదాపుగా 50వేల ఎకరాల్లో పంటనీట మునిగినట్లు వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనావేసింది.

ఉప్పొంగుతున్న పెన్‌ గంగా నది

ఉమ్మడి ఆదిలాబాద్‌లో నమోదైన వర్షపాతం వివరాలు :

1. కుమురంభీం సిర్పూర్‌(యు) 23.15
2. నిర్మల్‌ కడెం 22.48
3. మంచిర్యాల జన్నారం 13.85
4. ఆదిలాబాద్‌ మావల 13.05

Rains In Adilabad : జైనథ్‌- ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం పరిధిలోకి వచ్చే భోరజ్‌ అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రం సమీపంలో 44 నంబర్‌ జాతీయ రహాదారిపై నుంచి వరద ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిర్మల్‌ జిల్లా కడెం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరినప్పటికీ 18 గేట్లులో 14 గేట్లు తెరిచారు. సాంకేతిక కారణాలతో మరో 4 గేట్లు తెరుచుకోలేదు. ఏజెన్సీ పరిధిలోకి వచ్చే ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, సిర్పూర్‌(యు), గాదిగూడ, తిర్యాణి మండలాల్లో వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

కడెం ప్రాజెక్టు

Heavy Flood Water To Kadem Reservoir : ఎల్లంపల్లి, మత్తడివాగు, సాత్నాల, పీపీరావు, ఆడ, గడ్డెన్న, స్వర్ణ, బజార్‌ హత్నూర్‌ జలాశయంలోకి వరదపోటెత్తింది. వద్దంటే వాన అన్నట్లుగా సాగడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షన్నర ఎకరాల్లో పంట నీటమునిగింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం జిల్లాల కలెక్టరేట్లలో సహాయక చర్యలకోసం అధికారులు కంట్రోల్‌ రూంలను ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో కన్నా ఎక్కువగా వర్షపాతం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే నమోదైంది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details