తెలంగాణ

telangana

ETV Bharat / state

Heavy rain: ఆదిలాబాద్​లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం - heavy rain adilabad district

ఆదిలాబాద్​ జిల్లాలో శుక్రవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపుల కారణంగా కొన్నిచోట్ల చెట్లు కూలిపోయాయి. ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించిపోయాయి.

heavy rain in adilabad
ఆదిలాబాద్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం

By

Published : Jun 4, 2021, 1:49 PM IST

అదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్న సమయంలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలితో పాటు మండల కేంద్రంలో భారీ వర్షం కురిసింది. ఉట్నూరు మండల కేంద్రంలో గంటపాటు ప్రజలు ఎక్కడికక్కడే ఉండిపోయారు.

ఏజెన్సీ లోన్ ప్రధాన రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడ అక్కడ చెట్లు కూలిపోవడం వల్ల ట్రాఫిక్​కి అంతరాయం కల్గింది. బలమైన గాలితో పాటు కురిసిన వర్షానికి ఏజెన్సీలో చల్లటి వాతావరణం నెలకొంది.

ఇదీ చదవండి:తెరాస, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్​ రాజీనామా

ABOUT THE AUTHOR

...view details