ఆదిలాబాద్ పట్టణంలో కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. వారం రోజుల తర్వాత కురిసిన వర్షాలకు వాతావరణం చల్లబడింది. రైతులు సైతం ఆనందం వ్యక్తం చేశారు. ఆగకుండా కురిసిన వర్షానికి పట్టణంలోని రోడ్లన్నీ జలమయమై.. నిర్మానుష్యంగా మారాయి. పట్టణంతో పాటు.. బేల, జైనథ్, తాంసీ, భీంపూర్, గుడిహత్నూర్ మండలాల్లో కూడా వర్షం కురిసింది.
ఆదిలాబాద్లో భారీ వర్షం.. రహదారుల జలమయం! - ఆదిలాబాద్ న్యూస్
ఆదిలాబాద్ పట్టణంలో కురిసిన భారీ వర్షం కారణంగా పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. వారం రోజులుగా జాడకు లేని వర్షం.. గురువారం జోరుగా కురువడం వల్ల వాతావరణం చల్లబడింది. ఏకధాటిగా కురిసిన వర్షాలకు పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి.
ఆదిలాబాద్లో భారీ వర్షం.. రహదారుల జలమయం!