తెలంగాణ

telangana

By

Published : May 6, 2020, 3:25 PM IST

Updated : May 6, 2020, 4:01 PM IST

ETV Bharat / state

మండుటెండల్లోనూ మద్యం కోసం బారులు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మద్యం దుకాణాల ముందు జాతర వాతావరణం కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత తెరవడం వల్ల ఉదయం 6 గంటలకే బారులు తీరారు. భౌతిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

heavy que lines for wine bottles in adilabad
మండుటెండల్లోనూ మద్యం కోసం బారులు

ఆదిలాబాద్​లో పోలీసు బందోబస్తు నడుమ మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు మద్యం దుకాణాలు తెరవగా.. అంతకుముందే బారులు తీరారు. ఏజెన్సీ ప్రాంతంలోని నార్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల్లో ఉదయం నుంచే వైన్ షాపుల ముందు మందు కోసం ప్రజలు బారులు తీరారు. నిర్మల్ జిల్లా ముథోల్​లో వైన్​షాప్స్ ముందు మందు కోసం ఖాళీ బాటిళ్లు క్యూ లైన్​లో పెట్టి ఉదయం నుంచి ఎదురుచూశారు. ఒకరికి 4 బాటిళ్లు మాత్రమే ఇచ్చేలా ఆబ్కారీ అధికారులు నిబంధన పెట్టారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న 26 మద్యం దుకాణాల ముందు ఉదయం నుంచే బారీ ఎత్తున బారులు తీరారు. యజమానులు పూజలు నిర్వహించి దుకాణాలు ప్రారంభించారు. పోలీసు, ఎక్సైజ్ అధికారుల బందోబస్తు మధ్య... మాస్క్​ ధరించినవారికే మద్యం విక్రయించారు. మంచిర్యాల జిల్లాలోనూ... దుకాణాలు తెరవకముందే క్యూ కట్టారు. దుకాణాల ముందు ముగ్గుతో సర్కిల్స్​ ఏర్పాటు చేసి భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.

మండుటెండల్లోనూ మద్యం కోసం బారులు

ఇదీ చూడండి:తెరుచుకున్న మద్యం దుకాణాలు.. ఆనందంలో మందుబాబులు

Last Updated : May 6, 2020, 4:01 PM IST

ABOUT THE AUTHOR

...view details