కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుల సేవలను గుర్తించిన అదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న.. వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తన కుమారుడైన మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్ జన్మదినాన్ని పురస్కరించుకొని.. 120 మంది పాత్రికేయులకు రూ.2 లక్షల ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లించారు. అనంతరం కరోనా కిట్లను పంపిణీ చేశారు. అభిమానులు, కార్యకర్తల నడుమ పుర అధ్యక్షుడు జోగు ప్రేమేందర్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఆయనకు గజమాల వేసి కార్యకర్తలు అభిమానాన్ని చాటుకున్నారు.
జర్నలిస్టులకు ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లించిన ఎమ్మెల్యే
ఫ్రంట్ లైన్ వారియర్స్లా కరోనా సమయంలో సేవలందిస్తున్న పాత్రికేయులకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తన వంతు సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. తన కుమారుడు జన్నదినాన్ని పురస్కరించుకొని 120 మంది జర్నలిస్టులకు ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లించారు.
జర్నలిస్టులకు ఎమ్మెల్యే ఆరోగ్య బీమా