ఆదిలాబాద్ జిల్లాలో కరోనా టీకా నిర్వహణపై వైద్యారోగ్యశాఖ డ్రైరన్ చేపట్టింది. జిల్లాలో త్వరలో ఇవ్వనున్న వ్యాక్సిన్‌పై అపోహలకు తావులేకుండా ఈ డ్రైరన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
750 మందికి 30 కేంద్రాల్లో కరోనా టీకా డ్రైరన్ - corona vaccine dry run news
ఆదిలాబాద్ జిల్లాలో వైద్యారోగ్య శాఖ అధికారులు కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ముందుండి విధులు నిర్వహించిన 750 మందిని గుర్తించి వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కరోనా టీకా డ్రై రన్, ఆదిలాబాద్
కొవిడ్ సమయంలో ముందుండి విధులు నిర్వహించిన 750 మందిని వైద్యారోగ్యశాఖ గుర్తించింది. వీరందరికీ జిల్లాలోని 30 కేంద్రాల్లో అవగాహన కార్యక్రమం చేపట్టింది. టీకా తీసుకున్న తరువాత సిబ్బంది పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు.
ఇదీ చదవండి:ఫిబ్రవరి నుంచి భారత్ బయోటెక్ నాజల్ డ్రాప్ టీకా తొలిదశ ట్రయల్స్