ఆదిలాబాద్ పట్టణంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సంజయ్ నగర్ పంచముఖి ఆంజనేయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ పల్లకి యాత్ర కన్నుల పండువగా సాగింది. రామనామ భజనలు, కోలాటం చేస్తూ భక్తులు ముందుకు సాగారు. మహిళలు హారతులతో స్వాగతం పలికారు. రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి హనుమాన్ దీక్షాపరులకు మాలధారణ గావించారు.
కన్నుల పండువగా హనుమాన్ రథ యాత్ర - ఆదిలాబాద్
హనుమాన్ జయంతి వేడుకలు కన్నుల పండువగా సాగాయి. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని హనుమాన్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్లకి యాత్రలో పాల్గొని రామభజనలు చేశారు.
హనుమాన్ రథ యాత్ర