కలెక్టరేట్‌కు పోటెత్తిన ప్రజావాణి అర్జీదారులు - district collector
ఎన్నికల కోడ్ అనంతరం ఆదిలాబాద్‌లోని కలెక్టరేట్లో నిర్వహించిన తొలి ప్రజావాణికి అర్జీదారులు పోటెత్తారు.
పోటెత్తిన ప్రజావాణి అర్జీదారులు
ఆదిలాబాద్ కలెక్టరేట్‌కు ప్రజావాణి అర్జీదారులు పోటెత్తారు. జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికై కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ తర్వాత తొలి ప్రజావాణి ఇదే కావడం వల్ల అర్జీదారులు భారీగా తరలివచ్చారు.