తెలంగాణ

telangana

ETV Bharat / state

బోథ్ ఎంపీపీ, సర్పంచ్​, ఎంపీవోలపై చర్యలు తీసుకోవాలి: ప్రభుత్వ వైద్యులు - Government doctors protest

ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎంపీపీ, సర్పంచ్​, ఎంపీవోలపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ వైద్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఇంఛార్జీ ఎస్పీని కలిసి విన్నవించారు.

ప్రభుత్వ వైద్యుల నిరసన
ప్రభుత్వ వైద్యుల నిరసన

By

Published : May 8, 2021, 9:50 PM IST

ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, సర్పంచ్​, ఎంపీవోలను వెంటనే అరెస్టు చేసి, రిమాండ్​కు తరలించాలని డిమాండ్​ చేస్తూ ప్రభుత్వ వైద్యులు నిరసనకు దిగారు. లేనిపక్షంలో సోమవారం నుంచి జిల్లావ్యాప్తంగా విధులు బహిష్కరిస్తామని అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు వైద్యుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఇంఛార్జీ ఎస్పీని కలిసి విన్నవించారు.

విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తోన్న వైద్యులను భయబ్రాంతులకు గురిచేసిన అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకుని తమకు భరోసా కల్పించాలని కోరారు.

ఇదీ చూడండి: గోల్కొండ ఏరియా ఆస్పత్రిని సందర్శించిన సీఎస్

ABOUT THE AUTHOR

...view details