కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో తెచ్చిన కార్మిక, రైతు, ఉద్యోగుల చట్టాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు గురువారం ఇచ్చిన దేశ వ్యాప్త సమ్మె ఆదిలాబాద్ జిల్లా సింగరేణిలో విజయవంతంగా కొనసాగింది. భాజపా మినహా సీఐటీయూ, ఏఐటీయూసీ, టీఎన్‌టీయూసీ, ఇఫ్టూ, తెరాస అనుబంధ కార్మిక సంఘం, హెచ్‌ఎంఎస్ కార్మిక సంఘాలతో పాటు ఉద్యోగ సంఘాలు సార్వత్రిక బంద్‌లో పాల్గొన్నాయి. సింగరేణిలోని శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపుర్, గోలేటి, కైరిగూడ ఏరియాలలోని భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ గనులలో సంపూర్ణ బంద్‌లో కార్మికులు పాల్గొన్నారు.
సింగరేణిలో ప్రశాంతంగా దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె
దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె ఆదిలాబాద్ జిల్లా సింగరేణిలో విజయవంతంగా కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు గురువారం దేశవ్యాప్త సమ్మె చేపట్టాయి. భాజపా మినహా సీఐటీయూ, ఏఐటీయూసీ, టీఎన్‌టీయూసీ, ఇఫ్టూ, తెరాస అనుబంధ కార్మిక సంఘం, హెచ్‌ఎంఎస్ కార్మిక సంఘాలతో పాటు ఉద్యోగ సంఘాలు సార్వత్రిక బంద్‌లో పాల్గొన్నాయి.
మోదీ ప్రభుత్వం 40 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చడం, లాభాల బాటలో ఉన్న ఎల్‌ఐసీ, టెలికాం, సింగరేణి, రక్షణ, అంతరిక్షం వంటి 8 ప్రభుత్వరంగ సంస్థల్లోకి ప్రైవేటు పెట్టుబడులను అనుమతించడం, వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడం, స్వేచ్ఛా వ్యాపారం, పౌర సరఫరాల్లో సవరణలను నిరసిస్తూ సమ్మె చేపట్టారు. ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక చట్టాలను ప్రభుత్వం నిలిపివేయాలని కార్మిక నేతలు డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలు ఇచ్చిన బంద్‌లో పాల్గొన్న కార్మిక లోకానికి నేతలు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి:హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ఏం చేసిందంటే..?: షబ్బీర్ అలీ