తెలంగాణ

telangana

ETV Bharat / state

గంగా జలంతో గారెలు చేసి.. గోదావరికి నైవేద్యం - adilabad district latest news

నూనెతో గారెలు చేయడం సహజమే. కానీ గంగా జలంతో గారెలు చేసి నైవేద్యంగా సమర్పించడం ఎక్కడైనా చూశారా? అవును ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్​ నాగోబా జాతరకు ముందు మెస్త్రం వంశస్థులు... పవిత్ర గంగా జలంతో గారెలు చేసి గోదావరికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఇది తమ సంప్రదాయమని వారు అంటున్నారు.

Garlic with Ganga water and offered as an offering to Godavari in adilabad district
http://10.10.50.85:6060/reg-lowres/30-January-2021/tg-adb-53-30-gangajalamthogaarelu-ts1274_30012021194321_3001f_03130_212.mp4

By

Published : Jan 30, 2021, 11:04 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్​లోని నాగోబా జాతర ఏటా పుష్య మాసంలో వైభవంగా జరుగుతుంది. నాగోబా దేవత పూజల కోసం కావలసిన పవిత్ర గోదావరి జలాలను మెస్త్రం వంశస్థులు తీసుకురావడం ఆనవాయితీ. దానికోసం వారు కాలినడకన ఇప్పటికే మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు రేవు హస్తిన మడుగుకు చేరుకున్నారు. అక్కడ గోదావరికి ప్రత్యేక పూజలు నిర్వహించి జలాలను తీసుకువెళ్లడం ఆచారం.

గంగా జలంతో గారెలు...

గంగా జలంతో గారెలు చేసి గోదావరికి నైవేద్యంగా సమర్పించడం మెస్త్రం వంశస్థుల సంప్రదాయం. అందులో భాగంగా గోధుమ పిండితో గారెలు చేసి గంగా జలంలోనే వాటిని వేయించి... బెల్లం పానకంలో కలిపి గోదావరికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఏటా తాము సంప్రదాయబద్ధంగా ఇలా పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి:గాడియం స్పోర్టోపియా అథ్లెటిక్స్ వార్షికోత్సవాల్లో జయేష్ రంజన్

ABOUT THE AUTHOR

...view details