ఆదిలాబాద్‌లో విఘ్నేశ్వరుడి శోభాయాత్రను కలెక్టర్ దివ్య దేవరాజన్ ప్రారంభించారు. మహిళలతో కలిసి కోలాటం ఆడి సందడి చేశారు. మొదట ఎస్పీ విష్ణు వారియర్ గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి వాహనంలో ఉంచారు. డప్పు చప్పుళ్లు, కోటాలతో ఊరేగింపు చేశారు. ఈ శోభాయాత్రలో, జిల్లా పరిషత్ ఛైర్మన్ జనార్దన్, ఎమ్మెల్యే జోగు రామన్న, భాజపా నాయకులు శంకర్ పాల్గొన్నారు.
కలెక్టర్ కోలాటం... ఉత్సాహంగా గణేశుని శోభాయాత్ర - ganesh immration
నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుడి ఊరేగింపు ఆదిలాబాద్‌లో ఘనంగా జరిగింది. గణేశ్‌ని శోభాయాత్రను కలెక్టర్ దివ్య దేవరాజన్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

కోలాటం ఆడుతున్న కలెక్టర్
శోభాయాత్రలో కోలాటం ఆడిన కలెక్టర్ దివ్య దేవరాజన్
ఇవీ చూడండి: 21వేల మంది పోలీసులతో నిమజ్జనానికి భద్రత