కొవిడ్ దృష్ట్యా ఆదిలాబాద్ జిల్లాలో తొలిసారిగా ఎలాంటి ఆర్భాటాలు, డప్పువాయిద్యాలు లేకుండా సాదాసీదాగా గణేశ్ విగ్రహాల నిమజ్జనం కొనసాగింది. విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో వినాయక్‌చౌక్ శిశుమందిర్‌లో గణేశుడి తుది హారతి కార్యక్రమానికి పుర అధ్యక్షుడు జోగు ప్రేమేందర్, ట్రైనీ ఐపీఎస్ అధికారి అక్షయ్ యాదవ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
సాదాసీదాగా గణేశ్ విగ్రహాల నిమజ్జనం - ఆదిలాబాద్‌లో నిరాడంబరంగా గణేశ్ నిమజ్జనాలు
కరోనా కారణంగా ఈ ఏడాది గణనాథుని నిమజ్జనం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా సాగింది. లాక్డౌన్ నిబంధనల నడుమ లంబోదరుడికి తుదిహారతులు సమర్పించి ప్రజలు గంగమ్మ వడికి చేర్చారు.
సాదాసీదాగా గణేశ్ విగ్రహాల నిమజ్జనం
ఆయా మండపాల్లో ప్రతిష్ఠించిన విగ్రహాల వద్ద మహిళలు, పిల్లలు మాస్కులు ధరించి లంబోదరుడికి తుది విడ్కోలు పలికారు. ట్రాక్టర్లు, ఆటోల్లో ప్రతిమలు కూర్చోబెట్టి నిమజ్జనానికి తరలించారు. గణేష్ మహారాజ్‌కి జై అంటూ నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు.
ఇదీ చదవండి:స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు