తెలంగాణ

telangana

ETV Bharat / state

బతికుండగానే చంపేశారు.. రెవెన్యూ అధికారుల నిర్వాకం - Fraud in old age pension in Adilabad district

ఆదిలాబాద్​ జిల్లా దిలావర్‌పూర్‌లో అల్లి భూమవ్వ అనే వృద్ధురాలు నివాసిస్తోంది. ఆమె వయస్సు 73 ఏళ్లు. భర్త నడిపి ముత్యం అనారోగ్యంతో మృతి చెందాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుక్కు మతి స్థిమితం లేకపోవటం వల్ల ఉన్న ఇంటికే నిప్పు పెట్టి కాల్చేశాడు. ప్రస్తుతం ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి. నా అన్నవాళ్లు లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది ఆ వృద్ధురాలు.

Fraud in old age pension in Adilabad district
బతికుండగానే చంపేశారు.. రెవెన్యూ అధికారుల నిర్వాకం

By

Published : Apr 26, 2020, 9:10 PM IST

ఆదిలాబాద్ జిల్లా దిలావర్​పూర్​లో కడు పేదరికంలో ఉన్న భూమవ్వకు రేషను కార్డు ఉన్నప్పటికీ నాలుగేళ్లుగా ఎలాంటి సరకులు అందడం లేదు. రెవెన్యూ కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా కనికరించే వాళ్లు కరవయ్యారు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో విషయం తెలిసినా ఆ కాలనీ యువకుడు రమాకాంత్‌ వృద్ధురాలి పరిస్థితిని ‘ఈనాడు- ఈటీవీ భారత్​’ దృష్టికి తెచ్చారు. సమస్య పరిష్కారం కోసం అధికారులను సంప్రదించగా ఆసక్తికర విషయం వెలుగు చూసింది.

ఎఫ్‌ఎస్‌సీ వైబ్‌సైట్‌లో రేషను కార్డు, ఆధార్‌ కార్డు వివరాలు ఎస్‌కేఎస్‌ నమోదులో పరిశీలించగా భూమవ్వ మృతి చెందినట్లు ఉండటం గమనార్హం. ఈ విషయమై దిలావర్‌పూర్‌ తహసీల్దార్‌ సంతోష్‌రెడ్డిని సంప్రదించగా అది ఎప్పుడు జరిగిందో తమకు తెలియదని, ప్రస్తుతం ఆ వెబ్‌సైట్‌ని ప్రభుత్వం నిలిపివేసిందని ఇప్పుడు ఏమీ చేయలేమన్నారు. ఆమెకు తమ వంతు సహాయంగా 10 కిలోల బియ్యం అందిస్తామన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details