తెలంగాణ

telangana

ETV Bharat / state

Fishes Died: భారీగా చేపల మృత్యువాత.. రూ.5 లక్షలు నష్టం - చెరువులోని చేపలు మృతి

ఆదిలాబాద్​లోని ఖానాపూర్​ చెరువులో పెద్దఎత్తున చేపలు మృత్యువాత పడటం కలకలం రేపింది. దాదాపు రూ.5 లక్షల నష్టం జరిగి ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. చెరువులో నీటిపై తేలియాడుతున్న చేపలను చూసి బాధితులు లబోదిబోమంటున్నారు.

Fishes Died
ఆదిలాబాద్​లోని ఖానాపూర్​ చెరువులో పెద్దఎత్తున చేపలు మృత్యువాత

By

Published : Oct 11, 2021, 12:51 PM IST

Updated : Oct 11, 2021, 1:02 PM IST

భారీ సంఖ్యలో చెరువులోని చేపలు మృతి చెందడంతో మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రూ.5 లక్షల వరకు నష్టం జరిగిందని వాపోయారు. ఆదిలాబాద్​ జిల్లాకేంద్రంలోని ఖానాపూర్​ చెరువులో ఒక్కసారిగా పెద్ద ఎత్తున చేపలు మృత్యువాత పడటం స్థానికంగా చర్చనీయాంశమైంది.

భారీగా చేపల మృత్యువాత

చేపల మృతికి గుర్రపుడెక్క, కలుషిత నీరే కారణమని మత్స్యశాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధరించారు. దీనిపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని మత్స్యకారులకు హామీ ఇచ్చారు. మరో రెండు, మూడు రోజుల్లో మార్కెట్‌లో విక్రయించాల్సిన చేపలు కళ్లేదుటే చనిపోవడాన్ని మత్స్యకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమకు పరిహారం అందించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:Lorry hits a Bike in Hyderabad : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతి

Last Updated : Oct 11, 2021, 1:02 PM IST

ABOUT THE AUTHOR

...view details