గిరిజన జిల్లా ఆదిలాబాద్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. ఈ నెల 21న కొవిడ్ పాజిటివ్ వచ్చిన వృద్ధురాలిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మృతురాలికి హై బీపీ ఉండడం వల్ల చనిపోయిందని వైద్యాధికారి డా.నరేందర్ రాఠోడ్ తెలిపారు. జిల్లాలో వైరస్ కట్టడి చర్యలు ప్రారంభించామని... మృతురాలు ఉన్న ప్రాంతంలో ఇంటింటి సర్వే చేస్తున్నామని చెబుతున్న నరేందర్ రాఠోడ్తో ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి...
ఆదిలాబాద్‌లో తొలి కరోనా మరణం.. వైద్యులు ఏమంటున్నారంటే? - covid virus in adilabad
ఆదిలాబాద్ జిల్లాను కరోనా మహమ్మారి కలవరానికి గురిచేస్తోంది. వ్యాధికి గురైన ఓ మహిళ గురువారం మరణించింది. ఈ నెల 21న కొవిడ్ పాజిటివ్ వచ్చిన వృద్ధురాలిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించడం వల్ల మృతి చెందింది.
ఆదిలాబాద్ జిల్లాలో తొలి కరోనా మరణం