ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని ప్రభుత్వ బడులను పెద్దపులుల భయం వెంటాడుతోంది. ప్రధానంగా నెలరోజుల నుంచి పెన్‌గంగ నదీ పరివాహాక ప్రాంతమైన తాంసి(కె), గొల్లఘాట్, పిప్పల్‌కోటి, అంతర్గాం, అర్లి(టి) పాఠశాలల్లో విధులకు వెళ్లాలంటేనే ఉపాధ్యాయులు జంకాల్సి వస్తోంది.
వెంటాడుతున్న పెద్ద పులుల భయం
అక్కడ పాఠశాలల్లో విధులకు వెళ్లేందుకు ఉపాధ్యాయులు జంకుతున్నారు. భయంతో ఏకాగ్రతగా పాఠాలు వినలేకపోతున్నారు. గ్రామస్థులు పాఠశాల బయట కర్రలతో కాపలాకాస్తున్నారు. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? అయితే ఈ కథనం ఒకసారి చదవాల్సిందే..!
వెంటాడుతున్న పెద్ద పులుల భయం
మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ పులుల సంరరక్షణ కేంద్రం నుంచి మూడు పులులు భీంపూర్ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తుండడం కలకలం సృష్టిస్తోంది. వారం రోజుల వ్యవధిలో ఆరు మూగజీవాలను హతమార్చిన పులులు... తాజాగా తాంసి(కె) ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రహారిగోడ వద్దకు పెద్దపులి రావడం భయాందోళనకు దారితీస్తోంది.
ఇదీ చూడండి:-పదేళ్ల తర్వాత అమెరికా నుంచి వచ్చి టీచర్‌పై కేసు!