ఆదిలాబాద్ జిల్లాలో సోయా పంట పనికిరాకుండా పోయింది. ప్రధానంగా ప్రభుత్వం సరఫరా చేసిన జేఎస్ 335 రకం సోయా విత్తనంలో నాణ్యతలోపం బయటపడింది. మొక్క ఏపుగా పెరిగినప్పటికీ గింజపట్టకపోవడంతో రైతులు పంటపొలాల్లోనే పశువులను వదిలేస్తున్నారు.
సోయ పంట అయింది... పశువులకు మేత... - ఆదిలాబాద్ వార్తలు
సోయా విత్తనాల్లో నాణ్యత లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొక్క ఏపుగా పెరిగినప్పటికీ లోపల గింజ రాకపోవడంతో పంటను పశువులకు మేతగా వదిలేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మ గ్రామంలో... ఏకంగా 150 ఎకరాల సోయా పశువులకు మేతగా వదిలేశారు.

soya
పొలాన్ని సేద్యానికి సిద్ధం చేసి ఇస్తే కూలీకింద ఏకంగా పంటనంతా ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నప్పటికీ కూలీలు ఎవరూ పనిచేయడానికి ముందుకురావడంలేదు. జైనథ్ మండలం గిమ్మ గ్రామంలో 150 ఎకరాల సోయా పంటచేల్లోకి పశువులను వదిలేసిన రైతులతో ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ క్షేత్రస్థాయి ముఖాముఖి.
సోయ పంట అయింది... పశువులకు మేత
ఇదీ చదవండి:తండ్రి స్నేహితులే కిడ్నాప్ చేశారా?