తెలంగాణ

telangana

ETV Bharat / state

సీసీఐ కార్యాలయం వద్ద రైతులు, సిబ్బంది ధర్నా - ఆదిలాబాద్ సీసీఐ వద్ద రైతుల ధర్నా

Farmers Dharna at CCI Adilabad : ఆదిలాబాద్‌లోని సీసీఐ యంత్ర సామగ్రిని తుక్కు కింద విక్రయించాలన్న కేంద్ర నిర్ణయంపై నిరసన వ్యక్తమవుతోంది. భూములిచ్చిన రైతులు, ఫ్యాక్టరీ ఉద్యోగులు, సిబ్బంది ఆందోళనకు దిగారు. ఈ -టెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Farmers Dharna at CCI Adilabad
Farmers Dharna at CCI Adilabad

By

Published : May 19, 2022, 4:54 PM IST

Farmers Dharna at CCI Adilabad : ఆదిలాబాద్‌లో యంత్ర సామగ్రిని తుక్కు కింద విక్రయించాలన్న కేంద్ర నిర్ణయంపై.... భూములిచ్చిన రైతులు, ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది భగ్గుమంటున్నారు. ఆందోళనలతో తమ అక్కస్సును వెల్లగక్కుతున్నారు. ఆదిలాబాద్‌ పట్టణ శివారులోని చాందా-టి బైపాస్‌ వద్ద రైతులు బైఠాయించి నిరసన తెలిపారు.

CCI Adilabad : ఉద్యోగులు, సిబ్బంది సీసీఐ ప్రధాన ద్వారం ముందు ఆందోళన చేపట్టారు. ఈ -టెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. స్థానికులకు ఉపాధి లభిస్తుందని అప్పట్లో భూములు ఇచ్చామని, ఇపుడు ఫ్యాక్టరీని మూసివేసేలా తీసుకుంటున్న చర్యలను అడ్డుకుంటామని రైతులు అంటున్నారు.

"అప్పుడు మాయమాటలు చెప్పి మా దగ్గరి నుంచి భూములు తీసుకున్నారు. మూడు కిస్తీల్లో నగదు ఇస్తామన్నారు. ఒకటే కిస్తీ ఇచ్చిండ్రు. ఇప్పుడేమో ఈ భూములు అమ్ముకుంటామంటున్నారు. మా భూములు మాకు ఇవ్వాలి. లేనియెడల మేం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం." - రైతులు

"రెగ్యులర్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించిన తర్వాతే ఈ-టెండర్ అమలు చేయాలి. అప్పటివరకు ఈ భూముల్లో ఎవరినీ అడుగుపెట్టనివ్వం. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీ నడపడానికి రెడీగా ఉంటే.. కేంద్రం ఎందుకు అడ్డుపడుతోంది."- విలాస్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి

సీసీఐ కార్యాలయం వద్ద రైతులు, సిబ్బంది ధర్నా

ABOUT THE AUTHOR

...view details