తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆలోచన అదిరింది.. మిడత బెదిరింది.. - రైతు వినూత్న ఆలోచన.. పంటకు రక్షణ

పాలీహౌస్‌లో సాగు చేసే పంటలకు మిడతల బెడద ఉంటుంది. విత్తనాలు పెట్టగానే అవి విత్తనం, అప్పుడే వస్తున్న మొలకలను తినేస్తుంటాయి. ఆదిలాబాద్‌ జిల్లా భీంసరికి చెందిన హన్మండ్ల పెద్దఈరన్న అనే రైతు గతేడాది విత్తన స్థాయిలోనే మిడతలతో భారీగా నష్టపోవడం వల్ల ఓ ఆలోచన చేశారు. అదేమిటంటే..

ఆలోచన అదిరింది.. మిడత బెదిరింది..
ఆలోచన అదిరింది.. మిడత బెదిరింది..

By

Published : Jan 24, 2021, 7:46 AM IST

ప్రతి సమస్య ఓ పరిష్కారానికి మార్గం చూపుతుంది అనడానికి వారి ఆలోచనే నిదర్శనం. మిడతల వల్ల గతేడాది పంట నష్టపోయిన రైతు ఓ వినూత్న ఆలోచనతో మిడతలను తరిమికొడుతున్నాడు. పాలీహౌస్‌లో పంట సాగు చేస్తున్న ఆదిలాబాద్​ జిల్లా భీంసరకి చెందిన హన్మండ్ల పెద్ద ఈరన్న మిడతల నుంచి పంటను కాపాడుకునేందుకు ఓ వినూత్న విధానం పాటిస్తున్నాడు. అదెలా అంటారా..

గ్లాస్​తో తరిమికొడుతున్నారు..

విత్తు పెట్టిన చోట ప్లాస్టిక్‌ గ్లాస్‌ను బొర్లించారు. మిడతల దానిపై వాలి విత్తును తినేందుకు ప్రయత్నిస్తే.. చిన్నగా శబ్దం రావడంతో అవి వెళ్లి పోతున్నాయి. దీంతో వాటి బెడద తప్పింది. ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి రైతులతో చర్చించి మిడతల బెడద నుంచి పంటను కాపాడుకునేందుకు ఈ ఆలోచన చేశారు. మొలక నిలదొక్కుకున్నాక గ్లాస్‌లను తీసేయడం వల్ల ఎలాంటి నష్టం జరగకుండా పంట సాగవుతోందని ఉద్యానశాఖ అధికారి తెలిపారు.

ఇదీ చూడండి:డబ్బా మూత మింగిన చిన్నారి.. కాపాడిన వైద్యులు

ABOUT THE AUTHOR

...view details