Farmer Family Protest at Both: తాతల నాటి నుంచి సాగులో ఉన్న భూమి తమకు తెలియకుండా పట్టా చేసుకున్నారని ఓ రైతు కుటుంబం తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగింది. తమ భూమి తమకు దక్కకపోతే ఇక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని భీష్మించుకుర్చున్నారు. చివరికి మహిళ రైతు నుంచి మందు డబ్బాను లాకున్నారు. ఈ ఘటన మంగళవారం బోథ్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది..
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కౌఠబి గ్రామానికి చెందిన చట్ల నర్సింగ్... 60 ఏళ్ల క్రితం సర్వే నెం 23లో 15 ఎకరాల భూమిని నర్సింగ్ కొనుగోలు చేశాడు. ఆ భూమిని నర్సింగ్ కొడుకు నారాయణ, తాత పేరే పెట్టుకున్న మనుమడు నర్సింగ్ ఇప్పటికి ఆ భూమిలోనే సాగు చేస్తున్నారు. నవంబర్ 8న సంబంధిత రైతు కుటుంబానికి తెలియకుండా బోథ్‌కు చెందిన ఓ వ్యక్తి తన పేరుమీద పట్టా చేసుకున్నాడని నర్సింగ్ ఆరోపించారు. భూమి తమదేనంటూ కొన్ని రోజులుగా సదురు వ్యక్తి వేధింపులకు గురిచేసినట్లు వాపోయారు. బాధిత రైతు కుటుంబం... రెవిన్యూ అధికారులకు పలుమార్లు చెప్పిన పట్టించుకోలేదని ఆవేదన వెలిబుచ్చారు.