కరోనా ఆ కుటుంబాన్ని చిదిమేసింది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో కరోనా పంజాకు ఒకరి తర్వాత ఒకరు.. అయిదు రోజుల వ్యవధిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. బోథ్‌లో ఈ నెల 1న కుటుంబ పెద్ద మెరుగు నర్సయ్య(65) బలికాగా, ఆయన చిన్న కుమారుడు మెరుగు చిన్ననర్సయ్య(34) నిర్మల్‌లో చికిత్స పొందుతూ సోమవారం మరణించారు.
ఒకరి తర్వాత ఒకరు... అయిదు రోజుల్లో ముగ్గురు మృతి
కరోనా అందరి జీవితాలతో ఆటలాడుకుంటూ వారి ప్రాణాలు బలితీసుకుంటుంది. మాయదారి వైరస్ ఇంట్లో ఒకరికి సోకి... వారినుంచి కుటుంబం మొత్తానికి వ్యాపించి బలి తీసేసుకుంటుంది. బోథ్‌లో అయిదు రోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా... మరొకరు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు.
ఒకరి తర్వాత ఒకరు... అయిదు రోజుల్లో ముగ్గురు మృతి
ఈ విషాదం నుంచి కోలుకోక ముందే నర్సయ్య భార్య మెరుగు లక్ష్మి(58) నిర్మల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. చిన్ననర్సయ్య భార్య సైతం కరోనా బారిన పడి నిర్మల్‌లో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చూడండి:పెంపుడు కుక్కలతో పశువైద్యశాలలకు జనాల పరుగులు.. ఎందుకంటే?