కరోనా నివారణ కోసం కేంద్రం రాష్ట్రానికి రూ.7వేల కోట్లు ఇచ్చిందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు తెలిపారు. మంగళవారం తన పుట్టినరోజు వేడుకలను ఆయన నిరాడంబరంగా జరుపుకొన్నారు. జర్నలిస్టులకు నిత్యావసరాలను అందజేశారు. వివిధ పథకాల కింద రైతులకు, బడుగులకు నిధులు కేటాయిస్తోందని ఎంపీ పేర్కొన్నారు.
కేంద్రంపై తప్పుడు ప్రచారం మానుకోవాలి : ఎంపీ సోయం - ఎంపీ సోయం బాపూరావు పుట్టినరోజు వేడుకలు
కేంద్రం నిధులివ్వడం లేదని తెరాస నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారం మానుకోవాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు హితవు పలికారు. ఎంపీ పుట్టినరోజును పురస్కరించుకుని జర్నలిస్టులకు నిత్యావసరాల ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు.

కేంద్రంపై తప్పుడు ప్రచారం మానుకోవాలి : ఎంపీ సోయం
తెరాస నేతలు మాత్రం కేంద్రం నిధులివ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇకనైనా కేంద్రంపై దుష్ప్రచారాలు మానుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నపుడు జారీ చేసిన జీవో నెం.3ని సుప్రీంకోర్టు కొట్టివేసిందని... దీనిపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు.
TAGGED:
MP Soyam Bapurao Latest News