గిరిజనుల హక్కులను కాపాడుతాం: దత్తాత్రేయ - ఆదిలాబాద్ జిల్లా తాజా వార్తలు
ఆదివాసీ చట్టాలను మరింత పటిష్ఠంగా అమలు చేయాల్సి ఉందని.. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. గిరిజనుల హక్కులను కాపాడే విధంగా... 1/70 చట్టానికి అవరోధం కలగకుండా చర్యలు తీసుకునేలా.. తెలంగాణ గవర్నర్ తమిళసైతోనూ మాట్లాడతానని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా దర్శనానికి వచ్చిన దత్తాత్రేయకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వాగతం పలికారు. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చిన దత్తాత్రేయ, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి....
గిరిజనుల హక్కులను కాపాడుతాం: దత్తాత్రేయ