సమత కేసు తీర్పుపై ప్రాసిక్యూషన్, డిఫెన్స్ న్యాయవాదులేమన్నారంటే.. - సమత కేసు న్యాయవాదులతో ఈటీవీ భారత్ ముఖాముఖి
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత హత్యోదంతం కేసు కీలకదశకు చేరుకుంది. ఈనెల 27న తీర్పు వెలవడనుంది. కేసుకు సంబంధించి ప్రాసిక్యూషన్, డిఫెన్స్ న్యాయవాదితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
సమత కేసు విచారణలో ఈనెల 27న తీర్పు వెలువడనుంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం అటవీ ప్రాంతంలో నవంబర్ 24న జరిగిన సమత హత్యోదంతంపై అదే మండలానికి చెందిన షేక్ బాబు, షేక్ షాబొద్ధీన్, షేక్ మగ్ధుంపై కేసు నమోదైంది. అత్యంత అమానవీయంగా జరిగిన... ఈ ఘటనను నిర్భయ కేసులా పరిగణించి... నిందితులకు ఉరిశిక్ష వేయాలని ప్రాసిక్యూషన్ కోర్టును కోరారు. తీర్పుకు సంబంధించి తమకే అనుకూలంగా వస్తుందంటున్న ప్రాసిక్యూషన్, డిఫెన్స్ న్యాయవాదులతో మా ప్రతినిధి ముఖాముఖి.
TAGGED:
samatha case