ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో కరోనా పరీక్షలకు అక్కడి యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్, వరంగల్ తర్వాత ఆదిలాబాద్ మూడో కేంద్రంగా గుర్తిస్తూ ఇటీవల ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ కేంద్రం రోజుకు రెండు రకాల టెస్టులతో మొత్తం 60 నమూనాలు పరీక్షించే సామర్థ్యం కల్గిఉన్నట్లు రిమ్స్ సంచాలకులు బలరాం బానోత్ తెలిపారు.
రాష్ట్రంలో మూడో కరోనా పరీక్షల కేంద్రం ఏర్పాటు - Establishment of the third corona examination center in the state
రాష్ట్రంలో మూడో కరోనా పరీక్షల కేంద్రంను ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆదిలాబాద్‌తోపాటు నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు చెందిన కరోనా పరీక్షలు ఇక్కడ చేయనున్నామని వైద్యులు పేర్కొన్నారు.

రాష్ట్రంలో మూడో కరోనా పరీక్షల కేంద్రం ఏర్పాటు
వైద్యుల సిఫారసు మేరకే ఇక్కడ పరీక్షలు చేస్తామన్నారు. పరీక్షల్లో పాజిటివ్‌గా వస్తే వారిని వెంటనే హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించాలని ఆదేశాలున్నాయని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌తోపాటు నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు చెందిన కరోనా పరీక్షలు ఇక్కడ చేయనున్నామని వివరించారు.
ఇదీ చూడండి :ముద్దు పెట్టినందుకు వెంటాడుతున్న కరోనా..!