ఆదిలాబాద్ జిల్లాలో కరోనా నియంత్రణకు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో 11 పాజిటివ్ కేసులు నమోదుకాగా రిమ్స్ వైద్య కళాశాలలో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే తొలిసారిగా డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్‌ను ఏర్పాటు చేశారు.
రిమ్స్‌లో కరోనా వ్యాధి నియంత్రణకు టన్నెల్ ఏర్పాటు - ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ వైద్య కళాశాలలో కరోనా వ్యాధి నియంత్రణకు డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ ఏర్పాటు చేశారు. దీనిని కలెక్టర్ దేవసేన, ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు.
Breaking News
జిల్లా కలెక్టర్ దేవసేన, ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్ టన్నెల్‌ను ప్రారంభించారు. ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ వ్యాధి నియంత్రణకు సహకరించాలని అధికారులు కోరారు.
ఇదీ చూడండి :పారిపోయిన ప్రేమజంట- లాక్డౌన్ రూల్స్‌కు బుక్కైందంట!