ఆర్టీసీ కార్మికుల బంద్‌కు సంఘీభావంగా ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి సమ్మెను విరమించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఐకాస కన్వీనర్ అశోక్ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు పునరుద్ఘాటించారు.
ఆర్టీసీ బంద్‌కు మద్దతుగా ఉద్యోగ సంఘాల ఆందోళన - ఆర్టీసీ బంద్‌కు మద్దతుగా ఉద్యోగ సంఘాల ఆందోళన
ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన బంద్‌కు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు వస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమ్మెకు ఉద్యోగ సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
ఆర్టీసీ బంద్‌కు మద్దతుగా ఉద్యోగ సంఘాల ఆందోళన