ప్రాదేశిక ఎన్నికల ఏర్పాట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పూర్తి కావొచ్చాయి. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత జరుగుతున్న ఈ తొలి ఎన్నికల్లో ఓటరు ఎడమ చేతి మద్యవేలికి సిరా చుక్క వేయనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైనమంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్ జరగనుంది. ఈనెల 27న ఫలితాలు వచ్చినా ఎన్నికైన అభ్యర్థులు బాధ్యతల స్వీకరణకు జులై అయిదో తేదీవరకు ఆగాల్సిందేనంటున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జడ్పీ సీఈఓ నరేందర్తో ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి.
స్థానిక పోరుకు ఉమ్మడి ఆదిలాబాద్ సిద్ధం - ZPTC
రాష్ట్రంలో రేపు తొలిసారిగా జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బ్యాలెట్ పేపర్తో నిర్వహించే ఈ పోరులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.
స్థానిక పోరుకు ఉమ్మడి ఆదిలబాద్ సిద్ధం