ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మల్యాల గ్రామపంచాయతీ పరిధిలో రాత్రి భూమి స్వల్పంగా కంపించింది. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కొన్ని క్షణాల పాటు భూమి కంపించడం వల్ల రెండేళ్ల కిందట నిర్మించిన పాఠశాల భవానికి కాస్తంత పగుళ్లు తేలాయి. క్రీడా మైదానంలోనూ పగుళ్లు ఏర్పడ్డాయి.
మల్యాలలో కంపించిన భూమి.. పాఠశాల ఆవరణలో పగుళ్లు - ఆదిలాబాద్ తాజా వార్త
ఆదిలాబాద్ జిల్లా మల్యాలలో అర్ధరాత్రి వేళ స్వల్పంగా భూమి కంపించింది. పాఠశాల భవనానికి మోస్తారు పగుళ్లు ఏర్పాడ్డాయి.
మల్యాలలో కంపించిన భూమి.. పాఠశాల ఆవరణలో పగుళ్లు
అర్ధరాత్రి పూట జరిగిన ఘటన కావడం వల్ల ఉదయం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జండా ఆవిష్కరణ కోసం వెళ్లగా ఘటన వెలుగులోకి వచ్చింది. తొలుత గాలివాన భీభత్సం అనుకొన్నప్పటికీ... ఆ తరువాత స్వల్ప భూకంపమని నిర్ధరణ కొచ్చిన ప్రధానోపాధ్యాయుడు రమేశ్ నాయక్ అధికారులకు సమాచారం ఇచ్చారు.