తెలంగాణ

telangana

By

Published : Dec 13, 2019, 1:20 PM IST

ETV Bharat / state

'పౌరసత్వ సవరణ బిల్లుపై శాంతియుతంగా వ్యవహరించాలి'

పౌరసత్వ బిల్లుకు ప్రతికూలంగా కార్యక్రమాలు చేపడితే స్థానిక పోలీసుల అనుమతి తీసుకోవాలని ముస్లిం నాయకులను ఆదిలాబాద్ డీఎస్పీ డేవిడ్ కోరారు.

dsp_meeting_with_muslims_for_bill
'పౌరసత్వ సవరణ బిల్లుపై శాంతియుతంగా వ్యవహరించాలి'

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఉట్నూర్ డీఎస్పీ డేవిడ్ పౌరసత్వ సవరణ బిల్లుపై ముస్లిం మత పెద్దల అభిప్రాయాలు తీసుకున్నారు. బిల్లుపై అందరూ శాంతియుతంగా వ్యవహరించాలని... చట్ట ప్రకారం నడుచుకోవాలని డీఎస్పీ సూచించారు.

'పౌరసత్వ సవరణ బిల్లుపై శాంతియుతంగా వ్యవహరించాలి'
పలువురు ముస్లిం నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్​లో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు... రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు. బెంగాల్ ఎన్నికల రాజకీయాల కోసం దేశంలోని ప్రధాన సమస్యను పక్కదోవ పట్టించి ఆగమేఘాల మీద బిల్లును తీసుకు రావడం సరైంది కాదన్నారు. ప్రతికూల కార్యక్రమాలు నిర్వహిస్తే శాంతియుతంగా జరుపుతామని... చట్ట ప్రకారం నడుచుకుంటామని ముస్లిం పెద్దలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details