ఆదిలాబాద్‌లో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పరిసరాల పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కొత్త కుమ్మరివాడలో ఇంటింటికి తిరిగి నీటితొట్టెలు, టైర్‌లలో నిలిచిన నీటిని పారబోయించారు.
పరిసరాల పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ - ఆదిలాబాద్‌లో వైద్యఆరోగ్య శాఖ అవగాహన ర్యాలీ
ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని వైద్య సిబ్బంది సూచించారు. ఆదిలాబాద్‌లోని వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు.
పరిసరాల పరిశుభ్రత ర్యాలీ
నిల్వ నీటితో కలిగే అనర్థాల గురించి ప్రజలకు మలేరియా అధికారి శ్రీధర్ వివరించారు. రానున్న వానాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమల లార్వాను అంతమొందించడానికి నిలిచి ఉన్న నీటిని పారబోయాలని తెలిపారు.
ఇవీ చూడండి: చేపల కొనుగోళ్లకు ఎగబడ్డ జనం..
TAGGED:
latest news of adilabad