తెలంగాణ

telangana

ETV Bharat / state

Dogs chased a bear : ఎలుగుబంటిని పరిగెత్తించిన శునకాలు - ఆదిలాబాద్‌లో ఎలుగుబంటి సంచారం

Dogs chased a bear in Adilabad : ఎలుగుబంటిని శునకాలు పరిగెట్టించిన ఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అంతర్గావ్ శివారులో చోటుచేసుకుంది. సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి పొలాల్లోకి వచ్చిన ఎలుగును చూసిన రైతులు.. గ్రామస్థులు, శునకాల సాయంతో భల్లూకాన్ని తరిమికొట్టారు. ఈ వీడియోలో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Dogs chased a bear in Adilabad
Dogs chased a bear in Adilabad

By

Published : Jun 13, 2022, 1:49 PM IST

ఎలుగుబంటిని పరిగెత్తించిన శునకాలు

Dogs chased a bear in Adilabad : ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అంతర్గావ్ శివారులో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. వానాకాలం పంట వేయడానికి తెల్లవారుజామునే రైతులు, కూలీలు పొలాలకు చేరారు. ఈ క్రమంలో పంటచేల పరిసరాల్లో ఉన్న అటవీ ప్రాంతం నుంచి ఎలుగుబంటి ఒక్కసారిగా పొలాల్లో ప్రత్యక్షమైంది. ఎలుగును చూసి రైతులు, కూలీలు పరుగులంకించారు.

గ్రామంలోకి పరుగు తీసి గ్రామస్థులకు సమాచారం అందించారు. గ్రామస్థులంతా కలిసి ఎలుగుబంటి సంచరించే ప్రాంతానికి శునకాలతో వెళ్లారు. అక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్న ఎలుగుబంటిని శునకాల సాయంతో తరిమికొట్టారు. ఈ దృశ్యాలను వీడియో తీసిన పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఎలుగుబంటి నుంచి తమకు రక్షణ కల్పించాలని గ్రామస్థులు అటవీ శాఖ అధికారులను కోరారు.

ABOUT THE AUTHOR

...view details