తెలంగాణ

telangana

ETV Bharat / state

అంబేడ్కర్​ నివాళికి కేసీఆర్​కు సమయం లేదా? - CM KCR HAS INSULTED AMBEDKAR

హైదరాబాద్​లో అంబేడ్కర్ విగ్రహ కూల్చివేత ఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు.  మరో విగ్రహం ఏర్పాటు చేయాలని నినదించారు.

నిందితులను శిక్షించి, మరో విగ్రహం ఏర్పాటు చేయాలి : కుడాల స్వామి

By

Published : Apr 16, 2019, 6:54 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. హైదరాబాద్​లో అంబేడ్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగిందని, రాజ్యాంగం రచించిన మహనీయుడి పట్ల ప్రభుత్వం సరైన విలువలు పాటించట్లేదని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుడాల స్వామి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్​ దేశ ప్రజలు ఆరాధ్యంగా కొలిచే అంబేడ్కర్​కు నివాళులు అర్పించలేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను శిక్షించి, మరో విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్​లో అంబేడ్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది : ఎమ్మార్పీఎస్

ABOUT THE AUTHOR

...view details