గల్ఫ్ దేశాల నుంచి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన ప్రజలను జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ మనోహర్ పరిశీలించారు. 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని సూచించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
'విదేశాల నుంచి వచ్చిన వారు ప్రత్యేక గదిలో ఉండాలి' - corona effect in adilabad
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ మనోహర్ అన్నారు. ఉట్నూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి కొవిడ్-19 సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.
'విదేశాల నుంచి వచ్చిన వారు ప్రత్యేక గదిలో ఉండాలి'
విదేశాల నుంచి వచ్చిన వారు వీలైనంత వరకు ప్రత్యేక గదిలో ఉండాలని డాక్టర్ మనోహర్ సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో వైరస్ సోకకుండా జాగ్రత్తపడవచ్చని తెలిపారు.
- ఇదీ చూడండి :కరోనా రోగితో సెల్ఫీ- ఆరుగురు అధికారులు సస్పెండ్