ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్కోటి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థులకు 100 నిఘంటువులను పంపిణీ చేశారు. తుల్ల యాదయ్య ఫౌండేషన్, సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందజేశారు.
పాఠశాల విద్యార్థులకు 100 నిఘంటువుల పంపిణీ - adilabad news today
ఆదిలాబాద్ జిల్లా పిప్పల్కోటి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థులకు తుల్ల యాదయ్య ఫౌండేషన్, సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో 100 నిఘంటువులను పంపిణీ చేశారు. చదువుతోనే విద్యార్థులు సవాళ్లు సమర్థంగా ఎదుర్కోంటారని ట్రస్టు నిర్వాహకులు అన్నారు.
పాఠశాల విద్యార్థులకు 100 నిఘంటువుల పంపిణీ
చదువుతోనే విద్యార్థులు రాణించగలుగుతారని ట్రస్టు గౌరవ అధ్యక్షులు కాడిగిరి రఘువీర్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రంలో హెచ్ఎం నగేష్ రెడ్డి, ఎస్ఎంసీ ఛైర్మన్ షేక్ షరీఫ్, సర్పంచ్ కల్యాణి గంగయ్య, సభ్యులు నవీన్ యాదవ్, రామన్న, గజానన్ ముజాహిద్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :'ఇళ్ల నిర్మాణాలు ఉగాదిలోపు పూర్తి చేస్తాం'