సుదీర్ఘకాలం తరువాత జరిగిన ఉట్నూర్ ఐటీడీఏ సమావేశంలో... ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల వ్యక్తిగత ఆరోపణలు, ప్రత్యారోపణలకే ప్రాధాన్యమిచ్చారే తప్పా... గిరిజన సమస్యలపై చర్చకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు... కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ఉండవంటూనే తనపై కూడా వ్యక్తిగత ఆరోపణలు చేసినందున వాటిని ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే జోగు రామన్న డిమాండ్ చేశారు. దీంతో ఇంద్రకరణ్‌రెడ్డి జోక్యం చేసుకొని... వేదికపైనే ఉన్న.. సోయం బాపురావును వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని సూచించగా.. ఆయన అందుకు నిరాకరించడంతో సమావేశం.. గరంగరంగా సాగింది. ఇదే క్రమంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా... ప్రజాప్రతినిధులు, అధికారుల ఆదేశాలతో పోలీసులు మీడియాను సమావేశం నుంచి బయటకు పంపించడం విమర్శలకు తావిచ్చింది.
సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు
ఆదిలాబాద్ పాలనాధికారిపై తిరగబడతాం అని జడ్పీ ఛైర్మన్ జనార్దన్‌రాఠోడ్ చేసిన వ్యాఖ్యలపై కూడా చర్యలు తీసుకోవాలని....... తలమడుగు మండలం కాంగ్రెస్ జడ్పీటీసీ సభ్యుడు గోక గణేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే కలెక్టర్ దివ్యదేవరాజన్ స్పందిస్తూ... సమావేశంలో గిరిజన సమస్యలను చర్చించాలే తప్పా.. వ్యక్తిగత విమర్శలకు తావీయరాదని సూచించారు.