తెలంగాణ

telangana

ETV Bharat / state

కుచులాపూర్​లో అభివృద్ధి పనులు ప్రారంభం - కుచులాపూర్​లో అభివృద్ధి పనులు ప్రారంభం

న్యాయసేవా అధికార సంస్థ చొరవతో ఆదిలాబాద్​ జిల్లా కుచులాపూర్​లో నిర్మించిన సీసీ రోడ్డు, గ్రంథాలయాన్ని.. జస్టిస్​ టీ అమర్​నాథ్​ గౌడ్​ ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

కుచులాపూర్​లో అభివృద్ధి పనులు ప్రారంభం

By

Published : Sep 22, 2019, 5:23 PM IST

అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచులాపూర్​లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ టీ అమర్​నాథ్​ గౌడ్​ పర్యటించారు. గ్రామస్థులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. న్యాయసేవా అధికార సంస్థ చొరవతో నిర్మించిన సీసీ రోడ్డు, గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. పలువురు గ్రామస్థులు న్యాయమూర్తికి వినతి పత్రాలు అందజేశారు.

న్యాయసేవా సదస్సులో పాల్గొని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు రూ. 12 కోట్ల పరిహారం, గిరిజనులకు అటవీ హక్కు పత్రాలు, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అమర్​నాథ్​ గౌడ్​ పంపిణీ చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని, ఇంచార్జ్ కలెక్టర్ ప్రశాంతి, ఏస్పీ విష్ణు వారియర్, న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఉదయ్, జేసీ సంధ్యారాణి, ఉమ్మడి జిల్లా కోర్టులకు చెందిన న్యాయమూర్తులు, అధికారులు, ప్రజలు సదస్సుకు హాజరయ్యారు.

కుచులాపూర్​లో అభివృద్ధి పనులు ప్రారంభం

ఇదీ చూడండి: నాన్న డైలాగ్​ కూతురు చెబితే.. ఆ కిక్కే వేరప్పా

ABOUT THE AUTHOR

...view details