పాఠశాలలకు సంబంధించి పక్కా సమాచారాన్ని సేకరిస్తేనే సరిపడా నిధులు విడుదలవుతాయని ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. డైట్ కళాశాలలో సీఆర్పీలు, సీసీవోలతో వార్షిక ప్రణాళిక తయారీపై సమీక్ష నిర్వహించారు. వసతుల లేమి, విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, భవనాల పరిస్థితిపై కచ్చితమైన సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమీక్షలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సీఆర్పీలు, సీసీవోలు పాల్గొన్నారు.
కచ్చితమైన సమాచారమివ్వాలని సీఆర్పీలకు డీఈవో ఆదేశం - DEO
పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి కచ్చితమైన సమాచారం ఇవ్వాలని సీఆర్పీలకు ఆదిలాబాద్ డీఈవో రవీందర్ రెడ్డి ఆదేశమిచ్చారు.
కచ్చితమైన సమాచారమివ్వాలని సీఆర్పీలకు డీఈవో ఆదేశం