తలనొప్పి తగ్గడంలేదనే బాధ ఒకరిది... రక్తకణాలు పెరగడం లేదనే భయం మరొకరిది... కనీసం దీపావళి పండుగ కూడా చేసుకోలేకపోయామనే ఆవేదన ఇంకొకరిది... ఇలా ఒక్కొక్కరి బాధ... ఒక్కోతీరు... ఆదిలాబాద్ జిల్లాను డెంగీ వ్యాధిమళ్లీభయపెడుతోంది. జిల్లా వ్యాప్తంగా తాజాగా కురుస్తోన్న వర్షాలతో... వ్యాధుల తీవ్రత మళ్లీ పెరిగింది. ప్రధానంగా డెంగీ, టైఫాయిడ్ జ్వరాలతో జనం ఆసుపత్రులకు పరుగుపెట్టాల్సి వస్తోంది.
ఒక్కో మంచానికి ఇద్దరి చొప్పున వైద్యం
ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని పుత్లీబౌలీ, శాంతినగర్, లక్ష్మీనగర్, ఖుర్షీద్‌నగర్, హమాలీవాడ కాలనీల్లో డెంగీ, టైఫాయిడ్ జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. అధికారిక లెక్కల ప్రకారమే... 159 డెంగీ కేసులు నమోదయ్యాయంటే.. వ్యాధి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మరోపక్క ఆదిలాబాద్ గ్రామీణ మండలం పరిధిలోకి వచ్చే అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 78 డెంగీ వ్యాధి కేసులు నమోదు కావడం భయాందోళనకు గురిచేస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న వ్యాధిగ్రస్థుల తాకిడి కారణంగా ఆదిలాబాద్‌లోని రిమ్స్ వైద్య కళాశాలలో ఒక్కో మంచంలో ఇద్దరి చొప్పున వైద్యం అందించాల్సి వస్తోంది.