ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల సంప్రదాయాలకు పెట్టింది పేరు. ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలు తమ సంస్కృతి సంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తూ... వారి పండుగలను చేసుకుంటారు. అందులో భాగంగా బుధవారం పుట్లూరు మండలంలోని మత్తడి గూడాలో ఆదివాసీలు దండారి సంబరాలు ప్రారంభించారు. భోగి పూజలు చేసి తమ దేవుళ్లకు మెక్కులు చెల్లించుకున్నారు. గుస్సాడికి వినియోగించే వాయిద్యాలతో పాటు గిరిజనులు ధరించే టోపీలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంబురాల్లో తండాలో ఉన్న ప్రతీ ఒక్కరూ పాల్గొన్నారు.
మత్తడి గూడాలో దండారి సంబురాలు - భోగి పూజలు చేస్తున్న గిరిజనులు
అడవుల జిల్లా ఆదిలాబాద్‌లోని అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసి గూడాలో దండారి సంబురాలు కన్నులపండువగా సాగుతున్నాయి.
మత్తడి గూడాలో దండారి సంబురాలు