ఇటీవల రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపు 2 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగినట్లు(Huge Loss to Farmers) జిల్లాస్థాయి అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. ఈ వర్షాకాలంలో గత జూన్ నుంచి ఇప్పటివరకు 10 లక్షల ఎకరాలకు పైగా ఇలా నీట మునిగిందని(Huge Loss to Farmers) అనధికార అంచనా. కానీ, ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు పెద్దగా దెబ్బతినలేదని.. పొలాల నుంచి నీరు బయటికి వెళ్లిన తర్వాత కోలుకున్నాయని వ్యవసాయ శాఖ చెబుతోంది.
గతంలో అధ్యయనం చేయని వ్యవసాయశాఖ
కుంభవృష్టితో పంటలు నీట మునిగినా రెండు, మూడు రోజుల తరవాత నీరంతా వెళ్లిపోయాక క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టాలుంటే వివరాలు పంపాలని వ్యవసాయశాఖ సూచించిందని ఓ జిల్లా వ్యవసాయాధికారి తెలిపారు. ఎకరంలో కనీసం 33 శాతం దెబ్బతింటే నీరంతా వెళ్లిపోయాక పరిశీలించి నిర్ణయిస్తామని వివరించారు. గత జులై, ఆగస్టు నెలల్లో, ఈ నెలారంభంలోనూ అధిక వర్షాలతో లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగినా వ్యవసాయశాఖ ఎలాంటి అధ్యయనం చేయలేదు. ఎన్ని ఎకరాల్లో నీటమునిగాయో వివరాలు వెల్లడించలేదు. పంట నష్టాల(Huge Loss to Farmers)పై పరిహారం ఇవ్వడానికి గతేడాది ఎలాంటి లెక్కలు అడగలేదని, అందుకే ఈసారి వాటిపై దృష్టి పెట్టలేదని సీనియర్ వ్యవసాయాధికారి వెల్లడించారు. తాజా వర్షాలకు ఎన్ని ఎకరాల్లో పంటలు నీటమునిగి దెబ్బతిన్నాయ(Huge Loss to Farmers)ని వ్యవసాయశాఖ కమిషనర్, కార్యదర్శి రఘునందన్‌రావును సంప్రదించగా సమాధానం ఇవ్వలేదు.
ఈ వరద కింద పంటలున్నాయి
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హంగర్గ, బిక్నెల్లి, ఖండ్‌గావ్ ప్రాంతంలోని ఈ వరద నీటిలో 1500 ఎకరాల పైర్లు మునిగి ఉన్నాయి. గోదావరి, హరిద్ర, మంజీర నదులు కలిసే ప్రాంతం సమీపంలో వరద నీరు వెనక్కి వచ్చి పరిసర గ్రామాల్లోని వరి, సోయా, పొగాకు, పత్తి పంటలు ముంపునకు గురయ్యాయి. ఇదే ప్రాంతంలో గత నెలలో కురిసిన వర్షాలకూ పంటలు నీటమునిగాయి.
భోరుమన్న రైతన్న
ప్రకృతి ప్రకోపం ఓ రైతును భోరున విలపించేలా చేసింది. ఆదిలాబాద్ గ్రామీణ మండలం మామిడిగూడకు చెందిన కుంట నర్సింగ్ నాలుగెకరాల పొలంలో పత్తి వేశారు. వర్షానికి పంట పూర్తిగా నీట మునిగింది. పైరంతా నేలవాలింది. మంగళవారం పంటల పరిశీలనకు భాజపా నేతలు రాగా.. పెట్టుబడి కోసం చేసిన రూ.4 లక్షలు ఎలా తీర్చాలంటూ రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటంతా నేలపాలైందని నర్సింగ్ కంటతడి పెట్టారు. ఇక ఎలా బతికేదంటూ రోదించారు.
సగం పంట నాశనం
10 ఎకరాల్లో సోయా సాగు చేస్తే సగానికి సగం నాశనమైంది. ఎకరానికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి పెట్టా. 5 ఎకరాల్లో రూ. 1.75 లక్షల విలువైన పంట దెబ్బతిని అప్పులే మిగిలాయి.