తెలంగాణ

telangana

ETV Bharat / state

'యూపీ అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి' - ఆదిలాబాద్​లో సీపీఎం నిరసన

యూపీ అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేస్తూ ఆదిలాబాద్‌లో సీపీఎం నిరసన చేపట్టింది. కేంద్రంలో భాజపా ప్రభుత్వం వచ్చాకే దళితులపై అత్యాచారాలు దాడులు పెరిగాయని విమర్శించారు.

CPM protest at Adilabad for justice for rape victim in UP
'యూపీ అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి'

By

Published : Sep 30, 2020, 8:28 PM IST

ఉత్తరప్రదేశ్‌లో దళిత బాలికపై అత్యాచారం చేసి హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఆదిలాబాద్‌లో సీపీఎం ఆందోళన చేపట్టింది. పార్టీ నేతలు పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కేంద్రప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

భాజపా హయాంలో దళితులపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేష్‌ విమర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:హేమంత్​ హత్య కేసులో నిందితుల విచారణ

ABOUT THE AUTHOR

...view details