ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. కరోనా నియంత్రణలో భాగంగా బాధితులకు సాయం సదుద్దేశంతో సీపీఎం అనుబంధ ప్రజాసంఘాలు ముందుకొచ్చాయి. సీఐటీయూ, ఐద్వా, టీఎస్‌యూటీఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, తెలంగాణ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో సుందరయ్య భవన్‌లో కొవిడ్ కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు.
సుందరయ్య భవన్‌లో కొవిడ్ కాల్ సెంటర్ ప్రారంభం - కొవిడ్ కాల్ సెంటర్
కరోనా బాధితులకు సాయం చేసేందుకు సీపీఎం అనుబంధ ప్రజాసంఘాలు ముందుకొచ్చాయి. ఆదిలాబాద్‌లోని సుందరయ్య భవన్‌లో కొవిడ్ కాల్ సెంటర్ ఏర్పాటు చేశాయి.

కొవిడ్ కాల్ సెంటర్
ఈ కాల్‌సెంటర్‌ను జిల్లా అదనపు వైద్యాధికారి డా. సాధన, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డా. మనోహర్ ప్రారంభించారు. కాల్ సెంటర్లో ప్రత్యేకంగా ఐదు చరవాణిలను ఏర్పాటు చేసి .. ఆపదలో ఉన్న బాధితులకు సేవలు అందేలా కార్యకర్తలను అందుబాటులో ఉంచారు.